రూ,10 లక్షల విలువైన 12 దొంగతనపు బైక్‌ల స్వాధీనం

అరెస్ట్ చేసిన ఆదోని వన్ టౌన్,సి ఐ, ఎన్ రాజశేఖర్ రెడ్డి

పయనించే సూర్యుడు మే 30 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా దొంగిలించిన మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది శుక్రవారం ఆదోని పట్టణంలోని లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా బైక్‌పై వస్తున్న కర్నూలు జిల్లా హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31 అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు గతంలో ఆదోని వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, ఆదోని తాలూకా, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. అతని సమాచారం మేరకు ఆదోని ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలోని రహస్య ప్రదేశంలో దాచిన రూ,10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు, కేసు దర్యాప్తులో ఉందని అలాగే సిబ్బందిని అభినందించినటూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.