రెండు ట్రాక్టర్ల మధ్య నలిగిన వ్యక్తి తీవ్రగాయాలు

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 5 వత్సవాయి గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉట్ల అశోక్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదానికి కారణం అతివేగంగా వెళుతున్న రెండు ట్రాక్టర్లు ఢీకొని ప్రమాదానికి గురి అయింది అనంతరం డ్రైవర్లు అక్కడనుండి వెళ్ళినట్లు సమాచారం అటుగా వెళుతున్న వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చి మరల108కి సమాచారం ఇవ్వగా గాయాలు తగిలిన వ్యక్తిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ విషయం తెలుసుకున్న పోలీసు వారు కేసును దర్యాప్తు చేస్తున్నారు