రెవెన్యూ పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వాలని వినతిపత్రం అందించిన వార్డు సభ్యులు.

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 31 మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల జిల్లాలో ని రాయికల్ మండల పరిధిలోని మహితాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గన్నే గుట్ట పైన ఉన్నటువంటి మరో విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధి భక్తులతో ప్రతి రోజు ఉదయం ప్రతి శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రతి దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామస్తులు మండలంలోని అన్ని గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోరుట్ల మల్లాపూర్ ఇబ్రహీంపట్నం మేడిపల్లి జగిత్యాల సారంగాపూర్ మండల ల పరిధిలోని గ్రామాల నుంచి ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి మొక్కులు తీర్చుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించు కుంటారు. మహితాపూర్ గన్నే గుట్ట పైన ఉన్న శ్రీ కనక దుర్గమ్మ సన్నిధి కి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దుర్గమ్మ కు ప్రతి రోజూ రోజూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆలయం దిన దిన అబివృద్ధి చెందుతుందని ఇక్కడకు వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో మాట్లాడుకొనుట విశేషం. ఇట్టి ఆలయానికి ఇటికాల గ్రామానికి చెందిన చెన్నమ ని నివేదిత వెంకట కృష్ణారావు దంపతులు గన్నే గుట్ట వద్ద కు వచ్చి ఆలయం పరిసర ప్రాంతాల ను పరిశీలించి వారు వెంటనే ఆలయం నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు ఆలయానికి చెందిన అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేయుటకు తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో పాటు పలువురి మనుషుల ను పంపించి ఆలయా ఏర్పాట్లు పూర్తిచేశారు. అనాటి నుండి నేటివరకు ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి కోసం భక్తులు అధిక సంఖ్యలో ముందుకు వచ్చి ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వారి వంతు సహకారం అందిస్తామని తెలుపుతున్నారు. గ్రామంలో ఉన్న అమ్మవారి ఆలయ భక్తుల సౌకర్యార్థం కొరకు ఆలయ అభివృద్ధి కోసం ఇదివరకే రాజ్యసభ సభ్యులు దామోదర్ రావ్ వారి నిధుల నుండి ఆలయం వద్ద మెట్ల కొరకు సిమెంట్ రోడ్డు కొరకు గతంలో ముప్పై లక్షలు మంజూరు చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి ఆనాటి యంఎల్ సి జీవన్ రెడ్డి వారి నిధులు నుండి మెట్ల రెయిలింగ్ కోసం నాలుగు లక్షలు మంజూరు చేశారు. కాగా ఆయా నిధుల తోని పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులకు సంబంధించి సిమెంట్ రోడ్డు పూర్తి చేయాలని గ్రామానికి చెందిన యాచమనెని కిషన్ రావు సతీమణి అయిన అరుణ దేవి స్వంత అన్నా అయినా రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు ద్వారా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని గుట్ట వద్ద ఉన్న కనక దుర్గమ్మ ఆలయానికి చెందిన సిమెంట్ రోడ్డు పూర్తి చేయాలని వారి చెల్లెలు కొరడాముతో రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు వెంటనే తన నిధుల నుంచి పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఇట్టి నిధుల నుంచి ఆలయం వద్ద సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించి దాదాపు డెభ్బై శాతము పనులు పూర్తి చేసి మిగతా పనులు పూర్తి చేసి సమయంలో అక్కడే ఉన్న పట్టాదారు రాలు ఇక్కడి నుండి ఆలయానికి ఇతర ప్రాంతాలకు చెందిన వారికి ఇక్కడి నుండి దారి లేదని మీరు ఇక్కడి నుండి ఆలయానికి దారి పోసినట్టు అయితే మా కుటుంబ సభ్యులు అందరం కలిసి మీ పేర్లు నమోదు చేసి సొసైడ్ పేపరు మీద రాసి అందరం కలిసికట్టుగా క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటామని పదే పదే బెదిరింపులకు పాల్పడుతున్నారని అసభ్యకరంగా అసభ్య పదజాల పదాలు వాడుతున్నారు అని తెలుపుతూ అమ్మ వారి ఆలయానికి సిమెంట్ రోడ్డు పోసే సమయంలో రెవెన్యూ అధికారులు సర్వే అధికారులు పోలీసు అధికారులు ముఖ్యంగా లేడీ కానిస్టేబుల్ లను ఏర్పాటు చేయాలని ఈ రోజు తహసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగార్జున కి స్థానిక పోలీసు స్టేషన్ లో స్థానిక సబ్ ఇన్ స్పెక్టర్ అఫ్ పోలీస్ సుధీర్ రావు కి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మహితాపూర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఉప సర్పంచి దొంగ ప్రణయ్ రెడ్డి వార్డు సభ్యులు యాదవ సంఘం అధ్యక్షులు బుస గంగా మల్లయ్య అనుమల్ల రమ సత్యనారాయణ భూపెళ్ళి పరమేష్ తొగిటి నవీన్ కుమార్ గ్రామ నాయకులు అనుమల్ల సత్యనారాయణ కొల్ల కృష్ణరెడ్డి . పాలడుగు లింగారెడ్డి ఆలయ క్యాషియర్ నాగిరెడ్డి రఘు పతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.