పయనించే సూర్యుడు: జూన్ :13/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు ఈరోజు కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఐద్వా సత్తుపల్లి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కల్లూరు కార్యాలయంలో జరిగిన ధర్నాను ఉద్దేశించి మాచర్ల భారతి సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి మాట్లాడుతూ కేరళ తరహాలో మన రాష్ట్రంలో కూడా 14 రకాల నిత్యాస సరుకులు రేషన్ షాపుల ద్వారా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు అదేవిధంగా ప్రభుత్వం రేషన్ షాప్ ల అందించే సరుకులను తగ్గించుకోవడం కోసం బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయని దీనివల్ల ఆటంకం కలుగుతుందని తప్పించుకోవాలని చూస్తున్నదని ఆమె విమర్శించారు .నిత్యావసర సరుకులు అందించేంతవరకు పోరాటం చేస్తానని ఆమె అన్నారు యుద్ధం పేరుతో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల మీద భారాలు వేస్తూ ధనికులకు మాత్రం విమాన ఇంధనాలను తగ్గిస్తుందని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా పెంచిన పెట్రోలు డీజీలు గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, గృహజ్యోతి పథకం ద్వారా అందించే గ్యాస్ సిలిండర్లను 12కు తగ్గకుండా అందించాలని, లేనిపక్షంలో ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళనలు పోరాటాలు ఉద్ధృతం చేస్తామని చేస్తామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు .అర్హులైన పేద ప్రజలందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ,భూమి లేని వారికి భూమి పంచాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా సత్తుపల్లి డివిజన్ అధ్యక్షురాలు రత్నకుమారి,సత్తుపల్లి మండల కార్యదర్శి జాజిరి జ్యోతి,కల్లూరు మండలం అధ్యక్షురాలు బిరవల్లి తిరుమల,కరిష్మా, డివిజన్ కమిటీ సభ్యులు పుష్పవల్లి,షేక్ జాన్బీ షేక్ మౌలాబి ,కుర్రారపు రాజేశ్వరి,క్రాంతి ,భూలక్ష్మి,మాణిక్యం ,సుజాత ,శకుంతల ,మరియమ్మ, అగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.