రైతులను మళ్లీ మళ్లీ మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

వ్యవసాయ కార్మిక సంఘం నేత ధనంజయనాయుడు విమర్శ

పయనించే సూర్యుడు మే 30 నేరెడుచెర్ల మండల ప్రతినిది (చింతల శ్రవణ్) రైతులను కేంద్ర ప్రభుత్వం మోసానికి గురిచేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ఆరోపించారు. శనివారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం బోడోలదిన్నె గ్రామంలో కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధర కేవలం 72 రూపాయలు మాత్రమే పెంచడాన్ని నిరసిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం మరియు రైతు సంఘం ఆధ్వర్యంలో అట్టి జీవో కాపీలను దగ్ధం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ…. కేంద్ర ప్రభుత్వం 2026- 27 వరి పంటలకు కనీస మద్దతు ధరలను నామమాత్రపుగా పెంచి రైతులుకు అవసరమైన అడుగు మందుల రేట్లు బస్తా ఒక్కింటికి వెయ్యి రూపాయలు పెంచి రైతులను వ్యవసాయానికి దూరం చేసేందుకు కుట్ర పన్నుతోందని తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో వరి పoడకుండా చేసేందుకు కుట్రలు పన్ను తోoదని ఎరువులు, పురుగు మందులు, డీజిల్,పెట్రోల్, విద్యుత్తు, నీరు వరి సాగు పెట్టుబడి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఎంఎస్పి ఏమాత్రం సరిపోవని తక్షణమే క్వింటాల్ వరి ధాన్యానికి 3,500 మద్దతు ధర ప్రకటించాలని ధరలను సవరించేంతవరకు పోరాడుదాం అని కేంద్రం ప్రకటించిన నామమాత్రపు ధరలు అత్యంత దారుణంగా ఉన్నాయని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఉన్న రైతు వ్యతిరేక స్వభావం మరోసారి బట్టబయలు అయిందని 2014 నుంచి ఈనాటి వరకు వ్యవసాయాన్ని ధ్వంసం చేసేందుకు నరేంద్ర మోడీ అనేక కుట్రలు పన్నుతున్నారని బిజెపి ప్రభుత్వం ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వమని అన్నారు. క్వింటాల్ వరి ధాన్యానికి కేవలం 72 రూపాయలు మాత్రమే పెంచి అడుగు మoదు కట్టలకు బస్తా ఒక్కింటికి వెయ్యి రూపాయలు పెంచడం ఏమిటని బిజెపి పార్టీలో ఉన్న రైతులు కూడా మౌనం వీడి రోడ్లమీద రావాలని చీటికిమాటికి నెత్తిన నోరు పెట్టుకుని మొత్తుకొనే బిజెపి చీఫ్ రామచంద్రరావు ఈ విషయంలో రైతులకు ఏమి సమాధానం చెబుతారని బిజెపి ప్రభుత్వం ముమ్మాటికి అంబానీ ఆధాని లాంటి కార్పొరేట్ వర్గాలకు లాభం చేకూర్చే ప్రభుత్వమే తప్ప రైతులకు వ్యవసాయ కూలీలకు గ్రామీణ పట్టణ కార్మికులకు బిజెపి ప్రభుత్వ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని విషయం స్పష్టం అవుతుందని వారు కేవలం మతాన్ని మాత్రమే నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారని గ్రామీణ ప్రాంతాల రైతులు వ్యవసాయ కూలీలు గ్రామీణ కార్మికులు గమనంలో ఉంచుకొని చైతన్యం కావలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ జీవో కాపీలను దగ్ధం చేసిన వారిలో మండల సిపిఐ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్ ఏఐవైఎఫ్ నేరేడుచర్ల పట్టణ అధ్యక్షుడు పరికె భరత్, కుమార్ రెడ్డి, రాజసింహారెడ్డి, బోడోలదిన్నె సిపిఐ గ్రామ కార్యదర్శి దుర్గం కళింగం, గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు రాములు, మల్లెపూల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు