పయనించే సూర్యుడు మే 30 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ & రాయపోల్ మండల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ మేడమ్ వెంటనే స్పందించి చర్యలు చేపట్టడం రైతాంగానికి పెద్ద ఊరటనిచ్చిందని దౌల్తాబాద్ –రాయపోల్ మండల వ్యవసాయ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ కనకయ్య యాదవ్ తెలిపారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా పరిపాలన తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల వడ్ల నిల్వ, కొనుగోలు కేంద్రాల కొరత, పంట నిల్వల సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఈ అంశాలను జిల్లా కలెక్టర్ మేడమ్ దృష్టికి తీసుకెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించి అధికారులను అప్రమత్తం చేసి తక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఏఎంసీ గోదాములను వడ్ల నిల్వ మరియు కొనుగోలు అవసరాల కోసం వినియోగించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ తరఫున అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. రైతులకు అవసరమైన సహాయం అందించడంలో అధికారులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ కనకయ్య యాదవ్ మాట్లాడుతూ, రైతుల సమస్యలను వెంటనే గుర్తించి స్పందించిన జిల్లా కలెక్టర్ మేడమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతుల పట్ల ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధి అభినందనీయమని, భవిష్యత్తులో కూడా రైతులకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంపత్ రెడ్డి. నాయకులు రైతన్న.పంచామి గణేష్, దౌల్తాబాద్ ఎమ్మార్వో చంద్రశేఖర్ రావు, ఏపిఎం మైపాల్, ఆర్‌ఐ నాగరాజు, రాజేశ్వర్ రావు, మహేష్ యాదవ్ స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి పనిచేసిన అధికారులను మరియు ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా స్థానిక రైతులు అభినందించారు. రైతులకు అండగా నిలుస్తూ, సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం తీసుకున్న వేగవంతమైన చర్యలు దౌల్తాబాద్ ప్రాంత రైతుల్లో కొత్త నమ్మకాన్ని నింపాయి.