రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలుమెరుగైన సాగు పద్ధతులపై రైతులకు అవగాహన

పాల్గొన్నవారు ఏవో సాయికిరణ్ డాక్టర్ సంతోష్ కుమార్"

(పయనించే సూర్యుడు మే 24 రాజేష్ దౌల్తాబాద్ ) సిద్ధిపేట జిల్లా ముబారస్పూర్ గ్రామంలోని రైతు వేదికలో ఈరోజు “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల వారు, జిల్లా వ్యవసాయ శాఖ సహకారంతో నిర్వహించారు. మెరుగైన సాగు పద్ధతులు, నేల సంరక్షణ, సేంద్రియ వ్యవసాయం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిలిచింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ జి. సంతోష్ కుమార్ మాట్లాడుతూ రైతులు తక్కువ యూరియా వినియోగం చేయాలని, నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పచ్చిరొట్ట ఎరువులు మరియు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలని సూచించారు. అదేవిధంగా వివిధ పంటల్లో సాగునీటి ఆదా పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా లాభాలను పెంచుకోవచ్చని వివరించారు. అనంతరం టీచింగ్ అసిస్టెంట్ ఎస్. సురేందర్ మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనుగోలు సమయంలో నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వరి సన్న రకాలైన KNM-1638, BPT-5204, WGL-44, WGL-962, RNR-15048 వంటి రకాలు బోనస్ రకాలుగా గుర్తింపు పొందాయని తెలిపారు. అలాగే వివిధ పంటలలో సిఫారసు మేరకే యూరియా వినియోగించాలని రైతులకు అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని చెప్పారు. రైతులు మట్టి పరీక్షలు చేయించుకొని శాస్త్రవేత్తలు సూచించే సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముబారస్పూర్ గ్రామ సర్పంచ్ కానుగుల విజయ, హైమద్‌నగర్ గ్రామ సర్పంచ్ షేక్ అలీ, ఉప సర్పంచ్ రాజు.ఏఈఓ ఎల్ శిరీష. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 45 మంది రైతులు హాజరై కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు.