రైతు సేవ కేంద్రాలలో అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచాలి

పయనించే సూర్యుడు న్యూస్ యాడికి జూన్ 6 జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో యాడికి మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు డి చిన్నప్ప యాదవ్, జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు వెంకట్రాముడు యాదవ్, తాడపత్రి రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి ఓబిరెడ్డి సిపిఐ మండల కార్యదర్శి రఫీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో యాడికి మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రైతు సంఘం అధ్యక్షులు డి చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ, రైతు సేవా కేంద్రాలలో అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచాలి కేవలం పచ్చిరొట్ట విత్తనాలు మాత్రం అందుబాటులో ఉన్నాయి ప్రధానంగా రైతులు భూములను సేద్యం చేసుకొని విత్తుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రభుత్వం రైతులకు సబ్సిడీతో వేరుశనగ కాయలు తోపాటు పత్తి విత్తనాలు సబ్సిడీతో అందించాలి చిరుధాన్య విత్తనాలు వ్యవసాయ శాఖ రైతు సేవ కేంద్రాలు ద్వారా సిద్ధం చేసి ఖరీఫ్ ప్రారంభం అయినందున రైతు సేవా కేంద్రాలలో అన్ని రకాల విత్తనాలు 90% సబ్సిడీతో రైతులకు అందించాలన్నారు. అన్ని రకాల విత్తనాలు రైతులకు సరిపడు విధంగా అందించాలి అవి కూడా నాణ్యమైన విత్తనాలు అందించాలి గతంలో నకిలీ విత్తనాల వల్ల చాలామంది నష్టపోయిన రైతులకు పరిహారం కూడా అందించలేదు ఖరీఫ్లో పంట సాగు చేసి సకాలంలో వర్షాలు కురవక రైతులు తీవ్రంగా నష్టపోయారని. రైతుల దగ్గర డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా వారిని ప్రభుత్వం ఆదుకోవాలని.ఎరువులు పురుగుమందులు 90% సబ్సిడీతో అందించాలని విత్తన శుద్ధి మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాలి పండించిన పంటలకు మద్దతు ధర అందించడం లేదు అందువలన రైతులు నష్టపోవడం జరుగుతున్నది ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలి ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరలతోకొనుగోలు చేయాలి ,అన్నదాతసుఖీభవక్రింద రైతులకు 20వేలురూపాయలు అందించాలని రైతుల తీసుకుని రుణాలు ఒకేసారి రుణమాఫీ చేసి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 20 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా అందించాలి భూగర్భ జలాలు అడుగంటిపోయి ఎండిపోయిన ఉద్యాన పంట రైతులను నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో రైతులు నాగేంద్ర ,నరసింహులు, సురేష్ , తదితరులు పాల్గొన్నారు.