రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

పయనించే సూర్యుడు మే 20 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ ఉట్నూర్ ప్రతినిధి:ఉట్నూర్ మండలం ఏంద సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్ మండలం తోయగూడ గ్రామానికి చెందిన పెందూర్ లక్ష్మణ్‌(52) సక్కుబాయి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యారు ఈ ఘటనలో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు తీవ్రంగా గాయపడిన సక్కుబాయిని 108 సిబ్బంది ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందినట్లు ఈఎంటీ గణేష్, పైలట్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.