రోడ్డు ప్రమాద బాధితుడు బోగ నర్సింలును పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై నరోత్తం

పయనించే సూర్యుడు, జూలై 8 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొంది ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఝరాసంఘం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన బోగ నర్సింలును మంగళవారం ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై నరోత్తం వారి నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వై నరోత్తం ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం నుండి మరియు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పరామర్శించిన వారిలో వై నరోత్తంతో పాటు కుప్పానగర్ మాజీ సర్పంచ్ శంకర్, జి నర్సింలు, అంజన్న, బసంత్ పాటిల్, మల్లేశం, రామస్వామి మరియు గ్రామ ప్రముఖులు, ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు