రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూలై 0. 8.07.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పుంగునూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ అన్నారు మంగళవారం స్థానిక బస్టాండ్ లో ఆయన పలు వాహనాలను తనిఖీ చేశారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్నారు అదేవిధంగా కార్లు వంటి వాహనాలను నడిపేవారు సీటు బెల్టు పెట్టుకోవాలన్నారు మద్యం సేవించి వాహనాలను నడపరాదన్నారు వీటితో పాటు సెల్ఫోన్ డ్రైవింగ్ వద్దన్నారు తిరుపతి పలమనేరు పుంగనూరు వైపు వెళ్లే వాహనాలను తనిఖీ చేసి రికార్డులు సక్రమంగా లేని వారిపై జరిమానా విధించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు