రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

పయనించే సూర్యుడు, మే 21, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రౌడీషీటర్లకు బుధవారం పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది. వారు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, అనవసర విషయాలలో తలదూర్చవద్దని, సెటిల్‌మెంట్లు, దందాలు వంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించడం జరిగిందని స్థానిక ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. అనంతరం మొత్తం (08) మంది రోడీషీటర్లను సత్ప్రవర్తన కలిగి ఉండేలా తహసీల్దార్ ఎదుట బాండ్ ఓవర్ చేయించడం జరిగింది. ప్రజలు అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని, రోడీషీటర్లకు భయపడకుండా వారి చర్యలపై పోలీసుల నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.