లలిత కళలు భారతీయ సాంస్కృతిక వారసత్వాలు

పయనించే సూర్యుడు-07-06-2026-రాజంపేట న్యూస్ : లలిత కళలు భారతీయ సాంస్కృతిక వారసత్వాలు అని జిల్లా అపుస్మా జిల్లా కార్యదర్శి మరియు చెర్రీస్ అకాడమీ చైర్మన్ రాఘవరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, అపుష్మ కోశాధికారి మరియు ఫ్యూచర్ మైండ్స్ పాఠశాల కరస్పాండెంట్ వై.నందకిషోర్, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ నాయుడు, కార్యదర్శి సుభాన్, సంయుక్త కార్యదర్శి జి.రెడ్డయ్య, ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.బాలరాజు తెలియజేశారు. శనివారం ఏ.బి చంద్రారెడ్డి గార్డెన్స్ లో కొరియోగ్రాఫర్ పెనిగలపాటి శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు వేడుకలు ఐన పంచమ కళా వైభవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పైన పేర్కొన్న వారు పాల్గొని ప్రసంగిస్తూ భారతదేశ వారసత్వ సంపద అయిన లలిత కళలను సంరక్షిస్తూ ప్రతి ఏటా వేసవి శిక్షణ శిబిరం ద్వారా సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, మార్షల్ ఆర్ట్స్ వంటి యుద్ధ విద్యలలో శిక్షణనిస్తూ వేలాది మందిని కళాకారులుగా తీర్చిదిద్దుతూ దేశ వారసత్వ సంపదను పరిరక్షిస్తున్న డాన్స్ మాస్టర్ శివప్రసాద్ సేవలు అభినందనీయమని ప్రశంసించారు. అనంతరం ఈ కార్యక్రమంలో 120 మందితో కూచిపూడి బృంద నృత్య ప్రదర్శన, 60 మందితో సినీ మరియు జానపద నృత్య ప్రదర్శన, మార్షల్ ఆర్ట్స్, చిత్రలేఖనం, అన్నమాచార్య కీర్తనలతో సంగీత ప్రదర్శన, సనాతన వాహిని సంఘం తరపున భగవద్గీత శ్లోకాల పోటీలు నిర్వహించి బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. డాన్స్ మాస్టర్ శివ ప్రసాద్ మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా తనను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి విద్యాలయ పాఠశాల డైరెక్టర్లు పి.సి చౌదరి, టీ.వేణుగోపాల్, చిన్నయానంద ఆశ్రమం స్వామిని శ్రేయానంద మాతాజీ, సినీ దర్శకుడు శివమణి రెడ్డి, కౌన్సిలర్ రాఘవేంద్ర వర్మ, కడప గ్యాన్ విహార్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ పి.సుధాకర్, శ్రీ నటరాజ కళాక్షేత్రం ప్రొద్దుటూరు మొహిద్దిన్ ఖాన్, సంగీతం టీచర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.