పయనించే సూర్యుడు, జూలై 09 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల వినతుల మేరకు లింగంపల్లి రైల్వే స్టేషన్ లో గోదావరి ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్ , సికింద్రాబాద్ హిసార్ ఎక్స్ప్రెస్ రైళ్ళు ఇలా పలు రైళ్లు ఆపాలని, హిసార్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును డైలీ ఎక్స్ప్రెస్ రైల్ గా మార్చాలని అలాగే రైల్వే స్టేషన్ ను సికింద్రాబాద్ తరహాలో జంక్షన్ గా అభివృధి చేయాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కోరగా వారి చొరవతో దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీ ఏ. శ్రీధర్ మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్ కిరణ్ కుమార్ ని కలిసి వివరించి వినతిపత్రం అందజేసిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ లో దేశంలోని అన్ని రాష్ట్రా లు ,అన్ని ప్రాంతాల నుండి ప్రజలు వస్తారని, వెస్ట్ హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు హై రేజ్ అపార్ట్మెంట్ లు పెరిగాయని, శేరిలింగంపల్లి నియోజకవర్గ చుట్టు పక్కల దాదాపు 30 నుండి 40 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారని, మా ప్రాంత ప్రజల వినతుల మేరకు లింగంపల్లి రైల్వే స్టేషన్ లో గోదావరి ఎక్స్ప్రెస్, రాజ ధాని ఎక్స్ప్రెస్ , సికింద్రాబాద్ హిసార్ ఎక్స్ప్రెస్ రైళ్ళు ఇలా పలు రైళ్లు ఆపాలని, హిసార్ వీక్లీ ఎ క్స్ప్రెస్ రైలును డైలీ ఎక్స్ప్రెస్ రైల్ గా మార్చాల ని అలాగే రైల్వే స్టేషన్ ను సికింద్రాబాద్ తరహాలో జంక్షన్ గా అభివృధి చేయాలని చేవెళ్ల పార్ల మెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారిని కోరడం జరిగిందని, వారి చొరవతోనే ఈరోజు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీ ఏ. శ్రీధర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ కిరణ్ కుమార్ ని కలిసి సమస్యలను క్షుణ్ణంగా వివరించి వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు, వారు కూడా సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా పూర్తయ్యే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారన్నారు, ఈ కార్యక్రమం
లో లింగంపల్లి కంటేస్టేడ్ కార్పొరేటర్ ఎల్లేష్, కాలనీ ప్రజలు జలంధర్ రెడ్డి, రాంబాబు,బాలాజీ అశోక్ పారికర్, దొరబాబు, సుందర్ లాల్, కృష్ణ మూర్తి, అజయ్ గుప్తా, రాజేంద్ర కుమార్ తివారి, వినోద్ కుమార్ జోషి, తదితరులు పాల్గొన్నారు.