లింబాద్రి గుట్ట వద్ద బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

పయనించే సూర్యుడున్యూస్ జూలై 3 రిపోర్టర్ కొత్వాల లింబాద్రి నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం లింబాద్రిగుట్ట సమీపంలో అలజడి భీంగల్ పోలీస్ స్టేషన్ – నిజామాబాద్ జిల్లా 02.07.2026 లింబాద్రి గుట్ట వద్ద బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్ అరెస్టు చేయబడిన నిందితుడు : గంధం భాస్కర్, తండ్రి గంగా నర్సయ్య, వయస్సు 32 సంవత్సరాలు, వృత్తి: కూలీ, నివాసం: లింగాపూర్ చౌత్ గ్రామం, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లా. దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో భీంగల్ మండలంలోని లింబద్రి గుట్ట వెనుక ప్రాంతానికి తరచూ వెళ్లి, అక్కడికి వచ్చే యువతీ యువకుల ఫోటోలు, వీడియోలను వారి అనుమతి లేకుండా తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించేవాడు. అనంతరం వాటిని చూపిస్తూ పోలీసులకు చెబుతానని, సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని లేదా వివిధ కేసులు పెడతానని బెదిరించి వారి నుండి డబ్బులు వసూలు చేసేవాడు. తేదీ 29-06-2026 నాడు కూడా ఫిర్యాదుదారుడు మరియు అతని స్నేహితులను బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయగా, వారు భయంతో వారి వద్ద ఉన్న రూ.10,000/- నగదును నిందితుడికి ఇచ్చారు. మరిన్ని డబ్బులు కూడా ఇవ్వాలని నిందితుడు ఒత్తిడి చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, భీంగల్ పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌ నిమిత్తం గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచడం జరిగింది. ప్రజలకు విజ్ఞప్తి: ఎవరైనా వ్యక్తులను ఫోటోలు, వీడియోలు తీసి బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దు. ఇటువంటి సంఘటనలు ఎదురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను లేదా డయల్–100 ను సంప్రదించి సమాచారం ఇవ్వగలరు. ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడును. Sd/- స్టేషన్ హౌస్ ఆఫీసర్ భీంగల్ పోలీస్ స్టేషన్