లేఖర్ల సమస్యలను వెంటనే పరిశీలించాలని జీవో నెంబర్ 396 ను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి..

పయనించే సూర్యుడు 8, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జీవో నెంబర్ 396 ను విడుదల చేయడం జరిగిందని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షి ప్ విధానం వల్ల లేఖలు ఎంతో నష్టపోతారని తెలిపారు ఇది ఏ మాత్రం లేఖర్లకు మంచిది కాదని వారి జీవనోపాధికి ఇది గండంగా ఉందని వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ను ఈ జీవో ని వెంటనే ఉపసంహరించుకోవాలని పేరు బాబు తెలిపారు. మంగళవారం సర్పవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు రెండవ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బి ఎన్ రాజు మాట్లాడుతూ మా జీవనోపాధి కోల్పోవడం జరుగుతుందని జీవోను వెంటనే రద్దు చేయాలని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో చాగంటి సురేష్, టి పద్మరాజు, పి పూర్ణ దస్తవేదులు లేకర్ల సంఘ సభ్యులు పాల్గొన్నారు.