లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: వడ్డెమాన్ గోపాల్

పయనించే సూర్యుడు మే 28 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ కర్నూల్ మహానాడు లో దేశంలో గత ఏడాది వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికే వచ్చాయని బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి వడ్డెమాన్ గోపాల్ వెల్లడించారు. స్పీడ్ ఆఫ్ డ్యూయింగ్ బిజినెస్ నినాదంతో సక్సెస్ అయ్యామన్నారు. బుధవారం జిల్లలో క్లస్టర్‌లో ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమంలో గోపాల్ మాట్లాడుతూ.. 20, 25 ఏళ్ల లోపు యువతకు పబ్లిక్ పాలసీ, రాజకీయాల్లో పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మహిళా బిల్లు చట్టం అమలులోకి రావడం ఖాయమన్నారు. పార్టీలోకి పెద్ద ఎత్తున మహిళా శ్రేణులను తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తోందని గోపాల్ తెలిపారు.