పయనించే సూర్యుడు న్యూస్, జూలై 05 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉత్తరకంచి వంగవీటి రంగా యువసేన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొనగా విజయవంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ మంతెన వెంకటరమణ యువసేన సభ్యుల సేవా కార్యక్రమాలను అభినందించారు. సామాజిక సేవా దృక్పథంతో,ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్నదానం నిర్వహించడం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. యువసేన సభ్యులు సుంకర సురేష్, శీరం సురేష్, యాతం చిన్న, వీరపురెడ్డి హరిబాబు, ఉమ్మిడి సురేష్, బొరుసు రాజా, పోతురాజు నాని, గున్నాబత్తుల వీరబాబు, అనపర్తి రాంబాబు, బొడ్డు సురేష్, శీరం శ్రీను, పోతురాజు శివ, కొప్పిరెడ్డి స్వామి, రామిశెట్టి నాని, నాగులాపల్లి అప్పాజీ, సాధనాల చక్రయ్య, అన్నెం నాగు, యర్రంశెట్టి రాజా, ఏడిద సాయి, దూళ్ళ శేఖర్, గున్నాబత్తుల సాయి, కంటే అశోక్, ద్వారపురెడ్డి ప్రసాద్, చింతల పుష్పరాజ్, సాధనాల గణేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఉత్తరకంచి రంగా యువసేన సభ్యులు మాట్లాడుతూ మా అందరి ఆరాధ్య దైవం వంగవీటి రంగా సేవా భావాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.