వందనం గ్రామంలో ప్రజా పాలన గ్రామసభ నిర్వహణ

పయనించే సూర్యుడు జూన్ 05, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలంలోని వందనం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆవుల నాగేశ్వరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తహసీల్దార్ బాబ్జి ప్రసాద్, చింతకాని ఎస్ఐ వీరేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆవుల నాగేశ్వరావు మాట్లాడుతూ గ్రామంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. ప్రజల సహకారంతో అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అనంతరం గ్రామ ప్రజల నుంచి వివిధ సమస్యలు, అవసరాలపై వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో చర్చించారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సురేష్, ఇరిగేషన్ ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఆర్‌ఐ శ్రీనివాస్, గ్రామ సెక్రటరీ అయినాల శ్రీనివాస్, పొన్నం శంకర్‌రావు, మిట్టపల్లి కొండలరావు, ఎస్‌కే ఉద్దాడ్‌తో పాటు గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.