వచ్చే వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు, ప్రజాప్రతినిధులు పరిశుభ్రత పాటించాలి

"ఎంపీడీవో అఫ్జలుద్దీన్ ప్రత్యేక గ్రామసభల్లో అభివృద్ధి అంశాలపై చర్చ" ★ "గాజులపల్లి ప్రత్యేక గ్రామసభలో మాట్లాడుతున్న ఎంపీడీవో అఫ్జలుద్దీన్, "

పయనించే సూర్యుడు మే 5 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్, గ్రామం సూరంపల్లి గాజులపల్లి గ్రామాలలో గ్రామసభలో నిర్వహించడం జరిగింది.వచ్చే వానకలం సీజన్ లో గ్రామాల్లో సృజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండి పరిశుభ్రత పాటించాలని ఎంపీడీవో అఫ్జలుద్దీన్ అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండల పరిధిలోని గాజులపల్లి, సూరంపల్లి, లింగరాజుపల్లి, పోసాన్‌పల్లి, దిపాయింపల్లి, ముత్యంపేట గ్రామాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు.ఈ గ్రామసభలకు ముఖ్య అతిథులుగా గాజులపల్లిలో ఎంపీడీవో,అఫ్జలుద్దీన్, సూరంపల్లి లో ఎంపీ ఓ సయ్యద్ గపూర్, ముత్యంపేటలో ఏవో సాయికిరణ్, దీపాయంపల్లిలో ఏపిఎం మైపాల్, పోసన్ పల్లిలో, సూపర్డెంట్ జయపాల్ రెడ్డిలు హాజరై పలు అభివృద్ధి, ప్రజా సంక్షేమ అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గాజులపల్లిలో ఎంపీడీవో అఫ్జలుద్దీన్ మాట్లాడుతూ. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. మురుగు కాలువల శుభ్రత, చెత్త తొలగింపు, తాగునీటి వనరుల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. వ్యవసాయ రంగంలో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని వివరించారు. అలాగే వానాకాలం సాగు, సాగునీటి సదుపాయాల వినియోగం, పంటల నిర్వహణపై రైతులకు సూచనలు చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, పేర్ల తొలగింపు ప్రక్రియలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. గ్రామసభల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు పంజ స్వామి, గంగాధరి స్వప్న స్వామి, సునీత స్వామి,ప్రకాష్, దుర్గేష్, మల్లవ్వ లక్ష్మణ్, ఉప సర్పంచ్ లు గొల్లపల్లి ప్రేమ్ కుమార్, తొడంగి కరుణాకర్, పంచాయతీ కార్యదర్శులు నర్రా నవీన్, బొల్లం రాజేష్. ప్రమీల. దుర్గయ్య. పోచయ్య. మల్లేష్ అంగన్వాడి టీచర్ ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.