వట్టెంలో శుభకార్యానికి హాజరైన ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి

వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన ఎమ్మెల్యే

పయనించే సూర్యుడు జులై 4 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో వివాహ శుభకార్యానికి హాజరై నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను కలిసి వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిద్దె రాములు, వట్టెం గ్రామ మాజీ సర్పంచ్ అమృత్ రెడ్డి తదితర నాయకులు ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు. అలాగే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. శుభకార్యానికి విచ్చేసిన అతిథులకు నిర్వాహకులు ఆత్మీయ స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు.