02 Nov 2026 | 11:58 PM

వడియారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండలం వడియారం గ్రామంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పీఏసీఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ బోనగిరి బాగులు మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహిస్తామని తెలిపారు. రైతులు తమ వడ్లను ఆరబెట్టి, తాలు లేకుండా తీసుకువచ్చి కేంద్రంలోవిక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్లు ఎ.రఘురాములు, ఎస్.సిద్దిరాములు, కె. రాములు,ఎ. సత్యనారాయణ,ఎ. రాజులు,వి.కుమార్,బి. బలరాం,జి.రమేష్, ఎ. వెంకటేశం,సంఘ సభ్యులు సందీప్,విష్ణు, లక్ష్మణ్, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.