పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 9 వత్సవాయి మండలం: మండలంలోని మంగొల్లు పరిధిలో ఉన్న రవికంపాడు మేజర్-1,2 కాల్వల పరిధిలో రైతులు తమ పంట పొలాలకు సులభంగా చేరుకునేలా చేపట్టనున్న కాల్వగట్ల మరమ్మత్తు పనులకు జగ్గయ్యపేట శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కొబ్బరికాయ కొట్టి శుభారంభం చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన జొన్నలగడ్డ శ్రీ భాగ్యం, సత్యనారాయణ కి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.1,16,361 చెక్కును, అలాగే అన్నెపాక ప్రసాదు (యోబు) (తండ్రి: బాబురావు) కి మంజూరైన రూ.25,846 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ _రైతుల అవసరాలకు అనుగుణంగా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కాల్వగట్ల మరమ్మత్తులతో రైతులు తమ వ్యవసాయ పొలాలకు సులభంగా చేరుకోవడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా మరింత సౌకర్యవంతంగా సాగుతుందన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రైతుల సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారాలు అందించే దిశగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అవసరమైన అన్ని మౌలిక వసతులను దశలవారీగా కల్పించి వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీ కెనాల్ చైర్మన్ ఏలూరి గోపాలరావు, డీసీ కెనాల్ వైస్ చైర్మన్ మన్నె నారాయణరావు, డీఈ, ఏఈ, బొల్లం పురుషోత్తం, నెల్లూరి రామచంద్రరావు, శీలం నాగయ్య, సింగాల నరసింహారావు, ఎస్.కె. నభి, కాకనబోయిన పాండురంగారావు, నీలకంఠం వీరబ్రహ్మం, మన్నె శేషయ్య, మన్నె నరేష్, యామా శేషయ్య, మన్నె నారాయణ (మిల్క్), జడ పెద్ద గురవయ్య, బొల్లం నారాయణ, రాయుడి విశ్వనాథం, నాగళ్ళ అప్పారావు, అన్నెపాక నరసింహారావు, ఎండ్రాతి దానయ్య, బోయళ్ళ చంద్రం, యామా నాగయ్య, నల్లబోతు మణికంఠతో పాటు గ్రామ రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
.

