వరంగల్ నూతన పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పయనించే సూర్యుడు జూలై 8 తొర్రూర్ మండలం రిపోర్టర్ శ్రీధర్ వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎన్. శ్వేతా రెడ్డి, ఐపీఎస్ ని మంగళవారం పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన పోలీస్ కమిషనర్‌కు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు చేపట్టనున్న చర్యలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన శాంతిభద్రతల అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ సహకారం కొనసాగాలని ఎమ్మెల్యే కోరగా, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పోలీస్ కమిషనర్ శ్రీమతి ఎన్. శ్వేతా రెడ్డి పేర్కొన్నారు. ఈ మర్యాదపూర్వక సమావేశం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.