వలస కార్మిక మరణాలు ప్రభుత్వ హత్యలే

పయనించే సూర్యుడు మే28ఆదోనిడివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి కూటమి ప్రభుత్వానికి ఆదోని జిల్లా జేఏసీ హెచ్చరిక వలసల మరణాలకు పాలకుల నిర్లక్ష్యమే కారణం ఉపాధి లేక బెంగళూరుకు వలస వెళ్లి పౌష్టికాహార లోపంతో గర్భిణి స్త్రీ మృతి చెందడంపై జేఏసీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది ఆదోనిని జిల్లాగా ప్రకటించి, ప్రాజెక్టులు నిర్మించే వరకు పోరాటం ఆగదు!ఆదోని ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో బీమస్ కూడలి నందు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారానికి 193వ రోజుకు చేరుకున్నాయి రిలే నిరాహార దీక్షలో సుభాష్ చంద్రబోస్, రామాంజనేయులు, రామకృష్ణ, కుమార్, ప్రసాద్ కూర్చున్నారు వారికి ఆదోని జిల్లా జేఏసీ నాయకులు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఏసీ ముఖ్య నాయకులు పగడాల కోదండ, వైపి నాగరాజు, గోవిందరాజులు, సుజ్ఞానమ్మ, బండారి హనుమంతు, గుమ్మల బాలస్వామి సంయుక్తంగా మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం వల్లే ఆదోని ప్రాంత ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హృదయవిదారక ఘటన వలసల వెతలకు మరో బలి ఇటీవల ఆదోని పరిధిలోని కోసిగి పట్టణానికి చెందిన రజిత అనే ఒక నిండు గర్భిణి స్థానికంగా సరైన ఉపాధి లేక, బతుకుదెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్ళడం జరిగిందని నాయకులు గుర్తుచేశారు అక్కడ సరైన పౌష్టికాహారం అందక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు పౌష్టికాహారం పొందలేక ప్రసవమైన వెంటనే ఆమె మరణించడం అత్యంత దురదృష్టకరమన్నారు. తల్లి మరణంతో ఆ కుటుంబంలోని ముగ్గురు చిన్న పిల్లలు అనాథలుగా మారారని కన్నీటి పర్యంతమయ్యారు ఈ మరణానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని వారు ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వానికి ఆదోని జిల్లా సాధన జేఏసీ డిమాండ్లు వలసల నివారణకు శాశ్వత పరిష్కారం ఆదోని ప్రాంతంలో వలసలను అరికట్టాలంటే వెంటనే ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలి ప్రాజెక్టుల నిర్మాణం ఈ ప్రాంతంలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మించి సాగు మరియు తాగు నీటిని పుష్కలంగా అందించాలి అప్పుడే స్థానికంగా ఉపాధి పెరిగి వలసలు ఆగుతాయి ప్రాణాల రక్షణ కోసం సొంత ఊరిలోనే ఉపాధి దొరికితే గర్భిణీలు, బాలింతలు వలస వెళ్లే పరిస్థితి ఉండదని, ప్రభుత్వ పౌష్టికాహార పథకాలు వారికి సకాలంలో అందుతాయని స్పష్టం చేశారు ఆదోనిని జిల్లాగా ప్రకటించేంత వరకు, ఈ ప్రాంత ప్రజల వలసల కష్టాలు తీరేంత వరకు మా రిలే నిరాహార దీక్షలను విరమించే ప్రసక్తే లేదు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం ఆదోని జిల్లా జేఏసీ నాయకులు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పాల్గొని దీక్షా శిబిరానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు