వస్తాపూర్ వార్డు-3లో నూతన బోర్‌వెల్ ప్రారంభం

ప్రజల తాగునీటి సమస్యల పరిష్కారమే లక్ష్యం : డాక్టర్ ఎస్. ఉజ్వల రెడ్డి

పయనించే సూర్యుడు, మే 29 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): జహీరాబాద్ పట్టణంలోని వస్తాపూర్ వార్డు నంబర్-3లో నూతనంగా ఏర్పాటు చేసిన బోర్‌వెల్‌ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఎస్. ఉజ్వల రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక ప్రజల తాగునీటి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ బోర్‌వెల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉజ్వల రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ జి. శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి. శ్రీకాంత్ రెడ్డి, జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి. నర్సింహారెడ్డి, సి.డి.సి డైరెక్టర్ మల్లారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు అశ్విన్ పాటిల్, కాంగ్రెస్ నాయకులు కే. భీమయ్య, మాజీ ఎస్సీ సెల్ నాయకులు నాతనీయల్, అలాగే నరేష్, బబ్లు తదితర గ్రామ నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.