వాగ్దేవి మహిళ కళాశాలలో రేపు అనగా 28 5 2026న టాటా ఎలక్ట్రానిక్స్ మల్టీ నేషనల్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మే 28 జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజు వాగ్దేవి మహిళ కళాశాలలో రేపు అనగా 28 5 2026న టాటా ఎలక్ట్రానిక్స్ మల్టీ నేషనల్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది కావున జగ్గయ్యపేట నియోజకవర్గ మహిళా విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొని మంచి ఉద్యోగం ఉపాధి అవకాశాలను పొందవలసిందిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బుస్సా సురేష్ వివరించారు డిగ్రీ పూర్తి అయిన మహిళా విద్యార్థినులు బిటెక్ పూర్తయిన మహిళా విద్యార్థులలో మాత్రమే ఈ జాబ్ మేళా లో పాల్గొనే అవకాశం కలదు. ఈ జాబ్ మేళా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించబడి సెలెక్ట్ అయిన మహిళా విద్యార్థులకు వెంటనే శాలరీ తో కూడిన ఆఫర్ లెటర్ ఇవ్వటం జరుగుతుంది కావున ఈ అవకాశాన్ని విద్యార్థినిలు వినియోగించుకోగలరు ఈ జాబ్ మేళా ఆర్టీసీ బస్టాండ్ మున్సిపల్ పార్క్ పక్కనగల వాగ్దేవి కళాశాల లో నిర్వహించబడును. ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కళాశాల కరస్పాండెంట్ బుస సరిత జగ్గయ్యపేట నియోజకవర్గ మహిళా విద్యార్థినుల ను కోరడం జరిగింది