వాటర్ ప్లాంట్ నిర్మాణానికి రూ.2 లక్షలు విరాళం అందించిన కంబాల

పయనించే సూర్యడు పత్రిక జూలై 04 గోకవరం మండల రిపోర్టర్ దొరబాబు: గోకవరం గ్రామంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నూతన వాటర్ ప్లాంట్ నిర్మాణానికి విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు శుక్రవారం రూ.2 లక్షలు విరాళం అందించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రయాణికులు, ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించడం కోసం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సహకారం అందించాలని గోకవరం ఆర్టీసీ డిపో మేనేజర్, కార్మికులు, సిబ్బంది, ఏప్రిల్ నెలలో కంబాల శ్రీనివాసరావు వద్దకు వచ్చి కోరారు. స్పందించిన ఆయన వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సహకారం అందిస్తానని, హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా కంబాల శ్రీనివాసరావు గత నెలలో మొదట విడతగా లక్ష రూపాయలు విరాళాన్ని అందించారు. రెండో విడతగా శుక్రవారం తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వద్ద ఆర్టీసీ డిపో మేనేజర్ సుచరిత, మరో రెండు లక్షలు రూపాయలు అందజేశారు. ఇప్పటివరకు వాటర్ ప్లాంట్ నిర్మాణానికి మొత్తం రూ. 3 లక్షలు రూపాయలు విరాళం ఇచ్చారు. ప్రజల దాహార్తిని తీర్చడానికి ముందుకు వచ్చి వాటర్ ప్లాంట్ నిర్మాణానికి సహకరించిన కంబాల శ్రీనివాసరావుకి ఆర్టీసీ యాజమాన్యం, సిబ్బంది స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.