వికలాంగుల హక్కులను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

★ వికలాంగులకు రుణ సౌకర్యాలు కల్పించడం లేదు ★ వికలాంగుల హక్కుల పోరాట జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 15 మండల ప్రతినిధి బొద్దులభూమేష్ వికలాంగులను దేశంలో రాష్ట్రంలో కనీస అవసరాలకు దూరం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు రావాల్సినటువంటి ప్రభుత్వా సంక్షేమ పథకాలు కూడా వికలాంగుల చెంతకు చేరుతలేవ్ అంటే వికలాంగుల పట్ల చిన్నచూపు ఉందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది వికలాంగుల పెన్షన్ 4000 రూపాయల నుండి 6000 రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటిపోయిన ఇంతవరకు పెన్షన్ పెంచలేదు నూతనంగా పెన్షన్లు దరఖాస్తు చేసుకున్న వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేయడం లేదు వికలాంగులకు ప్రభుత్వ రుణ సౌకర్యాలు కల్పించడం లేదు వికలాంగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు వికలాంగులకు స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు రిజర్వేషన్ కల్పించాలి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులలో వికలాంగులకు అవకాశ కల్పించాలి గ్రామపంచాయతీ మున్సిపాలిటీ నగర పాలక సంస్థలలో కో ఆప్షన్ మెంబెర్లుగా అవకాశం కల్పించాలనీ పూర్తిగా నడవలేనటువంటి వికలాంగులకు నెలకు 15 వేల పెన్షన్ మంజూరు చేయాలని బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని 2016 దివ్యాంగుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయలని 2016 దివ్యాంగుల చట్టం పైన ప్రజలలో ప్రభుత్వ అధికారులలో వికలాంగులలో చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో వికలాంగులకు ఉచిత బస్సు రైలు ప్రయాణ సౌకర్యం కల్పించాలి వికలాంగులకు శాసనమండలి మరియు రాజ్యసభ స్థానాలలో అవకాశం ఇవ్వాలని సామాజిక ఉద్యమ నమస్కారములతో పెద్ద పెళ్లి సత్యనారాయణ వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్