విజయవంతమైన ప్రపంచ పర్యావరణ దినోత్సవం

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సలహాదారులు శ్రీరామ్ ఆర్య

పయనించే సూర్యుడు జూన్ 6 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లా న్యాయ సేవ అధికారిక సంస్థ ఆధ్వర్యంలో బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని గ్రామపంచాయతీలో సర్పంచ్ బోనాసి రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు విజయవంతమైంది ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సలహాదారులు శ్రీరామ్ ఆర్య మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి పౌరుని పై ఉంటుందని మనభూమి మన బాధ్యత అని తెలియజేశారు ప్రతి ఒక్కరూ వృక్షాలను రక్షించాలని ప్రతి ఒక్కరూ ఒక మొక్క బాధ్యతగా నాటాలని నీటిని సంరక్షించాలని ప్లాస్టిక్ నిరోధించాలని పరిసరాలను ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించడం జరిగింది. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సలహాదారులు గౌరవ శ్రీరాం ఆర్య మాట్లాడుతూ మహిళలు వృద్ధులు వికలాంగులు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తెగలు మైనారిటీలు దారిద్రరేఖకు (Bpl) దిగువ నివసిస్తున్న ప్రతి ఒక్కరికి 15 100 కాల్ చేస్తే (టోల్ ఫ్రీ నెంబర్) జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ తరఫున ఉచిత న్యాయ సలహాలు సూచనలు అందించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా చైల్డ్ లేబర్ నిషేధమని దాన్ని ఎవరైనా చిన్న పిల్లలను పనిలో పెట్టుకుంటే వారికి చట్ట ప్రకారంశిక్ష ఉంటుందని అలాగే 14 సంవత్సరాల లోపల బాలబాలికలు ప్రతి ఒక్కరూ బడిలోనే ఉండాలని తెలియజేశారు మైనర్స్(చిన్న పిల్లలు)కు డ్రైవింగ్ ఇవ్వవద్దని మరీ ముఖ్యంగా 18 సంవత్సరాల లోపల బాలికలపై ఎవరైనా సెక్సువల్ గా చూసిన ప్రేరేపించిన బలవంతం చేసిన వారిపై కేసు పెట్టి జైలు శిక్ష విధించబడుతుందని తెలియజేశారు చట్ట ప్రకారం 18 సంవత్సరాలు నిండిన బాలికలకు 21 సంవత్సరాలు నీడిన బాలురకు మాత్రమే పెళ్లిళ్లు జరిపించాలని ఆలా జరిపించిన వారికి చట్టప్రకారం చాలా తీవ్రమైన శిక్షలు ఉంటాయని తెలిపారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 ప్రకారం ప్రతి ఒక్కరు ఉచిత న్యాయ పొందే వీలు ఉందని తెలిపారు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉచిత న్యాయ సహాయం అందించటమే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ లక్ష్యమని పునరుద్గాటించారు ఇట్టి కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది బోనాసి రామచందర్ పంచాయతీ కార్యదర్శి శ్రీశైలం ఉపసర్పంచి గోవింద్ శ్రీనివాసులు వార్డు సభ్యులు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది హెల్త్ అసిస్టెంట్ కున గోవర్ధన్ గజవర్ధనమ్మ ఏఎన్ఎం మల్లికా ఆశా వర్కర్లు పార్వతి గ్రామపంచాయతీ సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్ ఆవేద బేగం కారోబార్ వెంకటేష్ సాయికుమార్ మరియు గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది