విద్యారంభానికి అక్షరాభ్యసమే తొలి అడుగు78 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి,

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ /04:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి,పిల్లల విద్యారంభానికి అక్షరాభ్యసమే తొలి మెట్టు అని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలచేత అక్షరాలు దిద్దించి వారిని ఆశీర్వదించారు. అనంతరం డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లల జీవితంలో అక్షరాభ్యసమే కీలకమన్నారు. ప్రతి చిన్నారి భవిష్యత్తుకు అక్షరాభ్యసమే బలమైన పునాది అని అన్నారు. చిన్నారులు చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి పెంచుకోవాలని కోరారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్యాభివృద్ధికి అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. అందులో భాగంగానే నూతన భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. పిల్లలకు మెరుగైన వసతులు, సురక్షితమైన వాతావరణంలో విద్యా, పోషకాహార సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సంక్షేమాధికారి ఎం.సరస్వతి, ఐసీడీఎస్ అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. 78 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్ లో బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తిమ్మాపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 78మందికి సీఎంఆర్ఎఫ్ కింద మొత్తం రూ.26.23 లక్షలు మంజూరు కాగా, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వాటిని చెక్కుల రూపంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. అనారోగ్యం, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సాయం అందిస్తోందని తెలిపారు. ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందాలని సూచించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వేలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందన్నారు. లబ్ధిదారులు అందుకున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దావు సంపత్ రెడ్డి, పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, బుధారపు శ్రీనివాస్, ఎస్.కొండల్ రావు,అసోద శ్రీనివాస్,పెరుక శ్రీనివాస్, చింతల లక్ష్మారెడ్డి,తిరుపతిరెడ్డి, తమ్మనవేణి రాములు యాదవ్, ఎలుక రాజు, నోముల అనిల్, గుంటి మల్లేశం,సుంకె నరేందర్, మాచర్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.