పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 13 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున ఉపాధ్యాయులు పోటీ తత్వంతో పని చేయడంతో పాటు ప్రతిభ కనబరిచిన పిల్లలకు నగదు బహుమతులు ఈయడం విశేషమని పెనుగంచిప్రోలు ఎంఈఓ డి.రవీందర్ , హెచ్ ఎం నక్కా బాబురావు అన్నారు. శుక్రవారం నాడు పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా శ్రీ స్వామి పుల్లయ్య మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు ముక్కా సత్యనారాయణ పాఠశాల ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులు చాకిరి మనీష, కొలకాని మేఘనలకు తన తల్లి ముక్కా భాగ్యమ్మ తరపున 5,116 రూపాయలు, 3,116 రూపాయలు మరియు మెమెంటోలను విద్యాదాత స్వామి గోపాలరావు, వార్డు సభ్యులు ఆజాద్ చేతుల మీదుగా అందించారు. 500 మార్కులు దాటిన మరో ఇద్దరు పిల్లలు నాగుల్ మీరాబి, జంగం మహాలక్ష్మిలకు 1,516 రూపాయలు నగదు బహుమతి, మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా దాతలు భాగ్యమ్మ, సత్యనారాయణలను యంఇఓ అభినందించారు. పాఠశాల విద్యార్థులు అందరికీ స్వామి గోపాలరావు పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేగినేటి వెంకట రమణ, బండి రాఘవరావు, గంటా వెంకటేశ్వరరావు, నల్లూరి పద్మ, స్వర్ణలత, భారతి, వాణి, ప్రమీల, త్రివేణి , స్వాతిశిల్ప, శ్రీదేవి, ఉష తదితరులు పాల్గొన్నారు.