పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ మే 23 గూడూరు బాలుర ఉన్నత పాఠశాల నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పి.ఎస్.ఆర్. ట్రస్ట్ అధినేత పొణకా దేవసేనమ్మ దాతృత్వంలో పదవ తరగతి పరీక్షలో స్కూల్ టాపర్ గా వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులకు 2000/- రూపాయల విలువగల చేతి గడియారం, మెమోంటో మరియు జిప్ ఫైలు ముఖ్యఅతిథి మాజీ రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి పొణకా దేవసేనమ్మ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అనంతరం దేవసేనమ్మ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక వారు మా ట్రస్టు ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు చేతి గడియారములు , మెమోంటో లు, జిప్ ఫైలు అందించడం చాలా సంతోషంగా ఉందని ఈ విద్యార్థులను చూసి రాబోవు విద్యార్థులు కూడా స్ఫూర్తి పొంది మనము కూడా ఒక వేదిక మీద బహుమతులు అందుకోవాలనే ఆలోచన రావాలని కోరారు. విద్యార్థులందరూ ఇష్టపడి చదివి మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని మీరు స్కూల్ టాపర్ గా వచ్చినందుకు మీకు మంచి విద్యను అందించిన ఉపాధ్యాయులకు స్కూలుకు మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ప్రోత్సహించేందుకు ఈ బహుమతులు అందజేస్తున్నానని తెలిపారు.విద్యార్థులు అందరూ కూడా ఇష్టపడి చదవాలని మీరు చదివిన స్కూల్ కి మంచి పేరు తీసుకురావాలని భవిష్యత్తులో మీ ద్వారా అనేకమందికి సహాయం పొందేలా మీరు ఎదగాలని ఆశిస్తున్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు వేగూరు రాజేంద్రప్రసాద్, నాగరాజు, రామమోహన్, చెంచు నారాయణ, పురుషోత్తమరావు, రజనీకాంత్, ఆనంద్, సుబ్రహ్మణ్యం, ఇబ్రహీం, ప్రభాకర్, సుబ్బారావు, ముని భాస్కర్, పుల్లంరాజు, స్కూలు ప్రధానోపాధ్యాయులు భారతి కుమార్ , ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.