విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదలచేయాలి: ఆర్ కృష్ణయ్య, బేరిరామచంద్ర యాదవ్ డిమాండ్

పయనించే సూర్యుడు జూలై 07 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ ఎంకుమార్తార్నాక విద్యానగర్ బిసి భవన్ లో జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు కాంగ్రెస్ ..రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు బిసి ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్. ఉచిత విద్య ఉచిత వైద్యం, హాస్టల్ సంక్షేమ పథకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపాలని ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ రేవంత్ రెడ్డికి డిమాండ్ చేయ డం జరిగింది.ఈరోజు కార్యాలయంలో జరిగిన జేఏసీ సమా వేశంలో చర్చల్లో పాల్గొంటూ కార్పొరేట్ విద్యాసంస్థలు మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీ లు కుప్పలు తిప్ప లుగా వచ్చినందున పేదలకు చదువు కొనడం కష్టంగా మారిం ది.పేద విద్యా ర్థులు చదువులు మానేస్తు న్నారు. విద్యార్థులకు ఫీజు రియంబ ర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ప్రత్యేకించి ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెట్టి విద్యకు అత్యధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు జరిగిన జేఏసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారి టీస్ వాళ్లతో చర్చించి తొందరలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం చేయాలని అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కూడా తమ సమస్యలను చర్చించాలని కోరడం జరిగింది. అవినీతి లంచగొండితనం పెరిగిపోయి పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లు ప్రభుత్వ ఆధీనంలో లేనట్టు నోట్ల కట్టలు బంగారు బిస్కెట్లు వెండి… బ్యాంక్ బ్యాలెన్స్ కంట్రోల్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బేరి రామచంద్ర యాదవ్ మరియు ఆర్కే సాయన్న ముదిరాజ్ కోరడం జరిగింది. బీసీలకు అన్ని విధాల సంక్షేమ పథకాలు వర్తింప జేస్తూ బడ్జెట్లో మేమెంతోమాకంత 50 శాతం నిధులు కేటాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. రాజకీయ ఆర్థిక సామాజిక అన్ని విధాల బీసీలకు న్యాయం చేసే వరకు మా పోరాటము ఆపేది లేదని గంటాపథంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రెటరీ శ్రీపురం హరికృష్ణ చారి, బీసీ జేఏసీ ఉపాధ్యక్షులు నాయి బ్రాహ్మణ శ్రీశైలం, యాదవ్ విద్యార్థి విభాగం కార్యదర్శి గౌరెల్లి అరుణ్ కుమార్ యాదవ్ శేరిలింగంపల్లి నాయి బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి ముత్యపు రవీందర్, మరియు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.