విద్యార్థులకు బుక్స్ యూనిఫార్మ్స్ సకాలంలో అందించాలి

★ బోధన్ మండల ఎంఈఓ కు వినతి పత్రం

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 12 బోధన్: ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలోవిద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ మరియు బ్యాగులు అందించాలని కోరుతూ తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలే నాగేష్ ఆధ్వర్యంలో గురువారం పోదాం మండల ఎంఈఓ నాగయ్య కు గ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా టీజివిపి బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలే నాగేష్ మాట్లాడుతూ నాలుగు రోజుల్లో స్కూళ్లు ప్రారంభం కానున్నాయి పాఠశాలలు తెరిచే నాటికి పేద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొదటి రోజే బుక్స్ యూనిఫార్మ్స్ బ్యాగులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీజివిపి బోధన్ డివిజన్ కార్యదర్శి నిఖిల్ టీజివిపి పట్టణ కార్యదర్శి వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.