పయనించే సూర్యుడు,జూలై 09 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ దివంగత ప్రజానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ప్రతి విద్యార్థికి, ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకమని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి అ సెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ పేర్కొ న్నారు. దృఢ సంకల్పం, అంకితభావం, కష్టపడే తత్వం, ప్రజాసేవ పట్ల నిబద్ధత ఉంటే జీవితంలో ఏ శిఖరాన్నైనా అధిరోహించవచ్చన అన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని మియాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద యూత్ కాంగ్రెస్ నాయకుడు నరేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వ హించిన నివాళుల కార్యక్రమంలో శ్రీ జగదీశ్వర్ గౌడ్ నియో జకవర్గ నాయ కులు, యువజన కాంగ్రెస్ కార్యకర్త లు,కళాశాల విద్యార్థులతో కలిసి పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘ నంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య, వైద్యం, వ్యవసాయం, రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి వంటి రంగాలకు వైఎస్ఆర్ అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. ఆర్థిక ఇబ్బందులు ఏ విద్యార్థి భవి ష్యత్తుకు అడ్డంకి కాకూడదనే సంక ల్పంతో ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించే అనేక సంక్షేమ కార్యక్రమా లను అమలు చేశారని తెలిపారు. విద్య ద్వారా వ్యక్తి జీవితమే కాకుండా కుటుంబం, సమాజం, రాష్ట్ర భవిష్యత్తు కూడా మారుతుందనే విశ్వాసంతో ఆయన పాలన సాగిందని అన్నారు. ప్రతి విద్యార్థి వైఎస్ఆర్ జీవితంలోని విలువలను ఆదర్శంగా తీసుకోవాలని, క్రమశిక్షణ,నిజాయితీ, అంకితభావం, సేవా తత్వం,సామాజిక బాధ్యత వంటి విలువలను అలవర్చుకుని ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.వ్యక్తిగత విజయంతో పాటు సమాజాభివృద్ధికి కూడా తోడ్పడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియో జకవర్గ నాయకులు కృష్ణ, మన్నేపల్లి సాంబశివరావు, యలమంచి ఉదయ్ కిరణ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీహరి, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్య రాజన్, రాంచందర్ గౌడ్, రవికుమార్, శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జాకీర్,రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్య దర్శి ఆసిఫ్,సాయి కిషోర్ తది తరులు పాల్గొన్నారు.
.
