పయనించే సూర్యుడు జులై 5 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు: మండల పరిధిలోని నూకలంపాడు గ్రామానికి చెందిన పోట్ల వెంకటేశ్వర్లు సుడి గేదె విద్యుత్ ఘాతానికి మృతి చెందింది. వెంకటేశ్వర్లు రోజులాగే శుక్రవారం ఉదయం తన గేదెలను మేత కోసం ఊరు బయటకి తోలారు. శనివారం ఉదయం వరకు గేదె ఇంటికి రాకపోవడంతో గ్రామ శివారులో వెతుకుతుండగా పల్లె ప్రకృతి వనం సమీపంలో 11 కెవి విద్యుత్ స్తంభం పడిపోయి తీగలు నేలకొరిగి తీగలపై గేదె పడి ఉంది. దీంతో అక్కడికి వెళ్లి చూడగా గేదె విద్యుత్ ఘాతానికి మృతి చెంది ఉంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో తన గేదే మృతి చెందిందని యజమాని వెంకటేశ్వర్లు తెలిపాడు. గేదె విలువ సుమారు 70 వేలు ఉంటుందని యజమాని తెలిపాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో గేద చనిపోవడంతో తమకు న్యాయం జరిగేలా చూడాలని విద్యుత్ ఉన్నతాధికారులను కోరాడు.