విద్యుత్ షాక్ తో గృహిణి మృతి

పయనించే సూర్యుడు మే 26. పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ విద్యుత్ షాక్ కు గురై ఓ వివహిత మహిళ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ముద్దపూర్ గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్థులు, కుటింబికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ముద్దపూర్ గ్రామానికి చెందిన పోలీసు పార్వతి (35) సోమవారం ఉదయం కూతురు స్యారీ పంక్షన్ ఉండడంతో అల్మరలో ఉన్న బట్టలు తీసుకునేందుకు వెళ్లగా ఆల్మరా పై ఉన్న విద్యుత్ తీగలను ఎలుకలు కొట్టడంతో విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ షాక్ గురై అయి అరవడం తో కుటింబికులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపి వేసి మెదక్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలుపడంతో వెంటనే కుటింబికులు పాపన్న పేట పోలుసులకు సమాచారం అందివ్వడంతో పాపన్న పేట ఎస్ ఐ శ్రీనివాస్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి పంచనామా నిర్వహించి మృతురాలి భర్త రవి పిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.