వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్, జూలై 07 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : వివేకానంద సేవా సమితి ఏలేశ్వరం పట్టణం ఇంచార్జ్ పెండ్యాల రాజు కుమార్తె మేరీ సునంద పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని నిరుపేద వృద్ధులకు భిక్షాటన చేసుకునే వారికి సుమారు 50 మందికి భోజనం పొట్లాలను అందజేశారు.అనంతరం పుట్టినరోజు వేడుకలను చైతన్య నగర్ కాలనీలో రాజు నివాసంలో నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు హాజరై మేరీ సునందుకు శుభాకాంక్షలు, తెలియసీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి సభ్యులు జుత్తుల శ్రీను, దాసరి కృష్ణ, ఎస్.మల్లిబాబు, వాతాడ డేవిడ్రాజు, రాజశేఖర్, గారా తులసి, బోడపాటి లాజరు, నీమ్మాది బుజ్జిబాబు, పెండ్యాల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

.