వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో బాలాజీ చౌక్ సెంటర్లో మజ్జిగ పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్, మే 26 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : ఏలేశ్వరం పట్టణంలో బాలాజీ చౌక్ సెంటర్లో వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు సూచనలతో సంస్థ సభ్యులు,కూటమి నాయకుల ఆధ్వర్యంలో ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పుట్టినరోజు సందర్భంగా దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి శ్రేణులు మీడియాతో మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వివేకానంద సేవాసమితి సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు మజ్జిగ పంపిణీకి ఆర్థిక సాయం అందించిన దాతలు శ్రీనివాస ట్రేడింగ్ కు అధినేత అంబటి రామకృష్ణ,శ్రీదేవి, పని కృష్ణ ఎంటర్ప్రైజెస్ అధినేత దొరారెడ్డి, మిరాకిల్ మినిస్ట్రీస్ అధినేత ప్రవీణ్ పాల్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గొల్లపూడి త్రిమూర్తులు, వాగు రాజేష్, అనంతరం రాజు, మామిడి లలిత, శ్రీను, రాతికింద సతీష్, జుత్తుల శ్రీను, బుగతా శ్రీను, వివేకానంద సేవా సమితి సభ్యులు అడపా శివప్రసాద్, పెండ్యాల రాజు, సునీల్, డేవిడ్, రాజబాబు, రాజశేఖర్, నాని తదితరులు పాల్గొన్నారు.