విశ్రాంత ఉపాధ్యాయుడు జెరిపోతుల కాశయ్య కన్నుమూత

పయనించే సూర్యుడు మే 23(నల్గొండ ) శాలిగౌరారం మండలం మాధవరం గ్రామం లో నివాసముంటున్న విశ్రాంత ఉపాధ్యాయుడు జెరిపోతుల కాశయ్య 78 సంవత్సరాలు అనారోగ్యంతో కన్నుమూశారు.ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో సంవత్సరాలు ఉపాధ్యాయ సేవలు అందించి విద్యార్థుల అభివృద్ధికి విశేష కృషి చేశారు.మృతుడికి ఇద్దరు కుమారులు కుమార్తె.ఆయన మరణ వార్త తెలిసి గ్రామ ప్రజలు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు నివాళులర్పించారు.