పయనించే సూర్యుడు జూన్ 6 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదోని పట్టణంలోని సీతారాం నగర్‌లో టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడునివాసం సమీపంలో మొక్కను నాటడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ… “ఒక్క మనిషి – ఒక్క చెట్టు” అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, నేడు మనం నాటే ప్రతి మొక్క రేపటి తరాలకు ప్రాణవాయువును అందించే అమూల్యమైన సంపద అవుతుందని తెలిపారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలంటే పచ్చదనాన్ని పెంపొందించడం ఎంతో అవసరమని అన్నారు.ఒక్క మొక్క నాటుకుందాం… రేపటి తరాన్ని కాపాడుకుందాం” అనే సందేశంతో ప్రతి ఇంటి వద్ద, ప్రతి వీధిలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో యువత ముఖ్యపాత్ర పోషించాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.