పయనించే సూర్యుడు జూన్ 01, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: ఆర్టీసీ కండక్టర్గా 40 సంవత్సరాల సుదీర్ఘకాలం సేవలందించి, నిన్నటితో పదవీ విరమణ పొందిన వంగ శ్రీనివాస్ గౌడ్ వీడ్కోలు కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.కార్యక్రమానికి జానపద కళాకారుల సంఘం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు టంకర శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి ఎదిర నర్సింలు పిలుపు మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నలుమూలల నుండి భారీ సంఖ్యలో జానపద కళాకారులు, సాంస్కృతిక సారధి కళాకారులు ,డప్పు బృందాలు, మహిళా కోలాటం బృందాలు , జానపద ధూమ్ ధాం ఆట పాటలతో ఉర్రూతలూగిస్తూ శోభాయమానంగా తీర్చి దిద్ది వీడ్కోలు సభను విజయవంతం చేసినందుకు పేరు పేరునా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతతో ధన్యవాదాలు తెలియజేశారు.