వీడ్కోలు సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు … ప్రతి ఒక్క కళాకారునికి

★ కళాకారుల రాకతో శోభాయమానంగా వంగ శ్రీనివాస్ గౌడ్ వీడ్కోలు సభ  విజయవంతం ★ ప్రతి ఒక్క కళాకారునికి హృదయపూర్వక ధన్యవాదాలు - అధ్యక్ష, కార్యదర్శులు టంకర శ్రీనివాస్, ఎదిర నర్సిములు

పయనించే సూర్యుడు జూన్ 01, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: ఆర్టీసీ కండక్టర్‌గా 40 సంవత్సరాల  సుదీర్ఘకాలం సేవలందించి, నిన్నటితో పదవీ విరమణ పొందిన వంగ శ్రీనివాస్ గౌడ్ వీడ్కోలు కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.కార్యక్రమానికి జానపద కళాకారుల సంఘం మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులు టంకర శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి ఎదిర నర్సింలు పిలుపు మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నలుమూలల నుండి భారీ సంఖ్యలో జానపద కళాకారులు, సాంస్కృతిక సారధి కళాకారులు ,డప్పు బృందాలు, మహిళా కోలాటం బృందాలు , జానపద ధూమ్ ధాం ఆట పాటలతో ఉర్రూతలూగిస్తూ శోభాయమానంగా తీర్చి దిద్ది వీడ్కోలు సభను విజయవంతం చేసినందుకు పేరు పేరునా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతతో ధన్యవాదాలు తెలియజేశారు.