పయనించే సూర్యుడు జూన్:09 హుజురాబాద్ ఆర్ సి ఇంచార్జ్ బండ శివానందరెడ్డి: మండలం లోని వెన్నంపల్లి గ్రామంలో కొంపెల్లి రాధమ్మ,ఎర్రమల్లారెడ్డి జ్ఞాపకార్థం కేపీఆర్ మండల స్థాయి క్రికెట్ పోటీలు పదవ వార్డు సభ్యులు కొంపెల్లి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో మండలంలోని ఏడు గ్రామాల జట్లు పాల్గొన్నాయి.ఈసందర్భంగా ఫైనల్ మ్యాచ్ జరుగగా ఫైనల్ మ్యాచ్లో ఘనపూర్-వెన్నంపల్లి గ్రామాల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆడారు.ఆటలో వెన్నంపల్లి జట్టు ఏడు పరుగులతో విజయం సాధించింది.ముఖ్యఅతిథిగా మాజీ పీఏసీఎస్ చైర్మన్ సారబుడ్ల రాజిరెడ్డి పాల్గొని విజేతలకు 8 వెయ్యిల రూపాయలు,పరాజితులకు 3 వెయ్యిల రూపాయలు బహుమతులు అందజేయడం జరిగింది.ఇట్టి టోర్నమెంట్ కి స్పాన్సర్లు కొంపల్లి ప్రశాంత్ రెడ్డి 10 వ వార్డు సభ్యులు వెన్నంపల్లి స్పాన్సర్ చేశారు.ఏడు రోజులపాటు నిర్వహించిన టోర్నమెంట్లో కంది ప్రసాద్ రెడ్డి సేవలందించారు.