వెన్నుపోటుకు రెండు సంవత్సరాలు పోస్టర్‌ను ఆవిష్కరించిన తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా/జగ్గయ్యపేట నియోజకవర్గం జూన్ 4 జగ్గయ్యపేట పట్టణంలోని ఈరోజు న నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ కార్యాలయం నందు నాయకులతో కలిసి వెన్నుపోటుకు రెండు సంవత్సరాలు పోస్టర్‌ను జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల పేరుతో మహిళలు, యువత, రైతులు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు.. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయాలు, ఉద్యోగ అవకాశాలు అందకపోవడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకపోవడం ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్టేనని ఆయన అన్నారు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అమలైన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.. ఈ వెన్నుపోటుకి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో స్థానిక ప్రజలు పార్టీ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ నిరసన కార్యక్రమానికి ప్రజలు మద్దతుని కోరారు. జగ్గయ్యపేట నియోజకవర్గం లోని వత్సవాయి, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండల కేంద్రాల్లో రేపు వెన్నుపోటు కి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన నేపథ్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగును అని తెలియజేశారు. అదే విధంగా జూన్ 8 9 తేదీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయని, జూన్ 12వ తారీకు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, సూపర్ సిక్స్ పథకాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.