వేములవాడ పట్టణ బిజెపి ఆధ్వర్యంలో మీడియా సమావేశం

పయనించే సూర్యుడు జూలై 8 (గణేష్ టౌన్ రీపోర్టర్ వేములవాడ : స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆలయ నియామకాలపై గత రెండు రోజుల నుంచి వస్తున్న కథనాలు చూస్తున్నాం ఒక నియమవలి చట్ట బద్దంగా ఉద్యోగాలలో నియమించాల్సిన బాధ్యత కలిగిన ఆలయ ఈవో నిబంధనలకు విరుద్ధంగా స్థానికేతరులకు ఉద్యోగం ఇవ్వడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా పట్టణ యువకులు ఎంతో కాలంగాఎదురు చూస్తు ఆలయ అభివృద్ధి అయితే యువతకు ఉపాధి కలుగుతుంది అని ఎదురుచూస్తున్నారు వీలైనంత త్వరలో ఈ నియమా నియామకాల అవకతవకలపై చర్యలు తీసుకోకపోతే బిజెపి పక్షాన ఆందోళనలను తప్పవని హెచ్చరించారు అలాగే రాజన్న ఆలయం దర్శనాలు నిలిపివేసే సమయంలో వేములవాడ ఎమ్మెల్యే వేములవాడ పట్టణ ప్రజలకు అన్ని పార్టీ నాయకులకు ఓపెన్ స్లాబ్ లో మీటింగ్ ఏర్పాటు చేసి మొన్నటి సంవత్సరం సమ్మక్క జాతర శివరాత్రికి దర్శనం అందిస్తానని మాట ఇచ్చి మొన్న శైలజ రామయ్య గారి ద్వారా వచ్చే సంవత్సరం దర్శనాలు ప్రారంభం అని తెలియపరచడం జరిగింది ఒకటే తెలియజేస్తున్నాం వేములవాడ పట్టణ అభివృద్ధి పేరిట రాజన్నను వేములవాడ ప్రజలకు దూరం చేశారు అభిషేక ప్రియుడైన రాజన్న దర్శనం ఈ శ్రావణం నుంచి వేములవాడ పట్టణ ప్రజలకు దర్శనం అందించినట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిరసనలు మరోసారి వేములవాడ బందుకు పిలుపునిచ్చి వేముల ప్రజలందరినీ మమేకం చేయడం జరుగుతుందని హెచ్చరించారు అలాగే భీమన్న గుడిలో స్థానికుల దర్శనాలకు ఇబ్బంది కలిగిస్తే కూడా ఊరుకునేది లేదని అన్నారు వీలైనంత త్వరగా కలెక్టర్ గారు చొరవ తీసుకొని అక్రమంగా డ్యూటీలో ఉన్న వారినీ గుర్తించి వారికి జాబులు ఇచ్చిన వారి పై చర్యలు తీసుకోకపోతే ఊరుకునేది లేదు అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర sc మోర్చా నాయకులు కౌన్సిలర్ కుమ్మరి శంకర్ కౌన్సిలర్స్ చిన్న ముత్యం వంగల శీను నాయకులు కోల కృష్ణస్వామి రేగుల మల్లికార్జున్ పిన్నింటి హనుమన్లు రేగుల శ్రీకాంత్ గుడిసె మనోజ్ చిక్కుడు మల్లేశం అన్నం నరసయ్య రఘుపతి నేరెళ్ల సాయి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.