వేల్పుల దాసు కి నివాళులర్పించిన సామినేని ఉదయభాను .

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం 1పెనుగంచిప్రోలు గ్రామం నందు శ్రీ కాకాని వెంకటరత్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుదీర్ఘంగా ఉపాధ్యాయులుగా పనిచేసిన వేల్పుల దాసు మరణించారన్న విషయాన్ని తెలుసుకొని వారి స్వగృహంకు వెళ్లి వారి భౌతికకాయానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను . ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు వేల్పుల దాసు కుమారులు వేల్పుల రవి కుమార్ కి పెనుగంచిప్రోలు మాజీ సర్పంచ్ పద్మ కి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ తునికిపాటి శివ , పెనుగంచిప్రోలు నీటి సంఘం అధ్యక్షుడు యలమందల నరసింహ రావు , మండల మాజీ ఎంపీపీ గుడపాటి శ్రీనివాసరావు , రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కోసూరి ప్రహ్లాద్ ,జనసేన నాయకులు తన్నీరు గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు.