పయనించే సూర్యుడు న్యూస్, జూన్ 05 (ఏలేశ్వరం మండలం రిపోర్టర్ ఏ శివాజీ) : స్థానిక గ్రంథాలయంలో గ్రంథ పాలకుడు కవికొండల సత్యనారాయణ ఆధ్వర్యంలో గత నెల 28వ తారీకు నుండి ప్రతిరోజు నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన తరగతుల్లో భాగంగా గురువారం విద్యార్థులు"చదవడం మాకిష్టం,పుస్తకాలే మా నేస్తం"అంటూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయుడు మామిడి రాము విద్యార్థుల చేత కథలు చదివించడం, రాయడం నేర్పించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ తెలుగు భాషకు గుండ్రని లిపి కలదని, మాతృ భాషా పట్ల ప్రతి విద్యార్థి మక్కువ పెంచుకోవాలని బోధించారు. నిరంతరం రాయడం వల్ల దస్తూరి బాగా రావడమే కాకుండా, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని ఆయన విద్యార్థులకు తెలిపారు. అనంతరం ఈ తరగతులలో పాల్గొన్న 25 మంది విద్యార్థులకు బిస్కెట్లు, శీతల పానీయాలు అందించారు.