వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల సందర్భంగాపోలీస్ హోంగార్డులకు 16 మందికి కాకి యూనిఫామ్ అందించిన జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిలర్ వట్టెం మనోహర్..

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 9 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు స్వర్గీయ శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా విఎంఆర్ ఫౌండేషన్ అధినేత వట్టెం మనోహర్ హోంగార్డులకు కాకి యూనిఫాం అందజేశారు.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైఎస్ఆర్సిపి నాయకులు, అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్ , రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి చౌడవరపు జగదీష్ పాల్గొని వారి చేతుల మీద కుడా యూనిఫామ్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా వేల్పుల రవికుమార్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అలాంటి ముఖ్యమంత్రిని మరల చూడలేమని ఆ కల ఒక జగన్మోహన్ రెడ్డి ద్వారా మాత్రమే నెరవేరుతుందని తెలియజేశారు… ఈ సందర్భంగా వట్టెం మనోహర్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వైయస్సార్ జయంతిని ఒక పండుగలాగా నిర్వహించుకుంటారని వారికి గుర్తుగా వారి పేరు మీద ఒక సేవ కార్యక్రమంగా ఈ రోజు న పోలీస్ హోమ్ గార్డ్ సోదరులకు యూనిఫామ్ అందించడం జరిగిందని తెలియజేశారు.. వారితోపాటు ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట పట్టణ వైఎస్ఆర్సిపి నాయకులు.. దివ్వేల రామారావు, గోగుల వెంకయ్య, గంగోలు వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు

.